e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News భార‌తీయుడు 2 సినిమాపై ఆశ‌లు రేకెత్తించిన శంక‌ర్

భార‌తీయుడు 2 సినిమాపై ఆశ‌లు రేకెత్తించిన శంక‌ర్

భార‌తీయుడు 2 సినిమాపై ఆశ‌లు రేకెత్తించిన శంక‌ర్

భారీ గ్రాఫిక్స్ తో అద్భుత‌మైన చిత్రాలు తెర‌కెక్కించి ప్రేక్ష‌కులకు స‌రికొత్త వినోదం పంచే ద‌ర్శ‌కుల‌లో శంక‌ర్ ఒక‌రు. భారతీయ సినిమా మేకింగ్ స్టైల్‌ను మార్చేసిన శంక‌ర్ త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన సినిమాలు తెర‌కెక్కించారు. ఇందులో భార‌తీయుడు చిత్రం కూడా ఒక‌టి. ఈ మూవీకి సీక్వెల్‌గా భార‌తీయుడు 2 చిత్ర షూటింగ్ కూడా మొద‌టు పెట్టారు. కొంత షూటింగ్ కూడా పూర్తైంది. అయితే సినిమా షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగి కొంద‌రు మృతి చెంద‌డం, క‌రోనా ఎఫెక్ట్ ఉదృతంగా ఉండ‌డంతో భారతీయుడు 2 చిత్రీక‌ర‌ణ ఆపేశారు. అయితే సినిమాను పూర్తిగా ఆపేశార‌ని వ‌స్తున్న నేప‌థ్యంలో శంక‌ర్ క్లారిటీ ఇచ్చారు.

భార‌తీయుడు 2 సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఇటీవ‌ల శంక‌ర్‌కు నోటీసులు పంపారు. మాతో చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం భార‌తీయుడు 2 సినిమా పూర్తి చేశాకే వేరే ప్రాజెక్ట్ టేక‌ప్ చేస్తా అన్నారు. కాని ఒప్పందాన్ని ఉల్లంఘించారు అంటూ వాళ్లు మ‌ద్రాస్ హైకోర్టు ఆశ్ర‌యించారు. దీనిపై స్పందించిన శంక‌ర్ .. ఈ సినిమా కోసం విదేశీ సాంకేతిక నిపుణులు అవ‌స‌రం. కరోనా నేప‌థ్యంలో వారు ఇండియాకు రావ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు అని శంక‌ర్ అన్నారు. ప‌రిస్థితులు అనుకూలించాక ‘ఇండియన్ 2’ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తామని శంకర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలియజేసారు. ప్ర‌స్తుతం శంక‌ర్.. రామ్ చ‌ర‌ణ్ చిత్రంతో పాటు అప‌రిచితుడు రీమేక్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు.

Advertisement
భార‌తీయుడు 2 సినిమాపై ఆశ‌లు రేకెత్తించిన శంక‌ర్
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement