శనివారం 30 మే 2020
Cinema - May 16, 2020 , 09:01:08

బాత్‌ట‌బ్‌లో మందు తాగుతూ ఫోటోల‌కి ఫోజిచ్చిన అర్జున్ రెడ్డి భామ‌

బాత్‌ట‌బ్‌లో మందు తాగుతూ ఫోటోల‌కి ఫోజిచ్చిన అర్జున్ రెడ్డి భామ‌

సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన అందాల భామ షాలిని పాండే. ఈ చిత్రంలో విజయ్‌తో చేసిన రొమాన్స్ యువ‌త‌ని చాలా ఆక‌ట్టుకుంది. ఈ సినిమా త‌ర్వాత షాలిని జాత‌కం తిరిగిన‌ట్టే అని అంద‌రు భావించారు. కాని ఈ అమ్మ‌డు తెలుగులో మహానటిలో చిన్న పాత్ర... కళ్యాణ్ రామ్ 118 సినిమాలు చేసింది.

పెద్ద‌గా బ‌డా ఆఫ‌ర్స్ లేని షాలిని ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైంది. త్రోబ్యాక్ ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తుంది. తాజాగా..గోవాలో ఓ బాత్ టబ్ లో స్విమ్ చేసిన తర్వాత రిలాక్స్ కోసం మందు తాగుతున్నట్లున్న ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోపై నెటిజ‌న్స్ భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. 


logo