శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 15, 2020 , 13:21:28

'శ‌కుంత‌లా దేవి' పాత్రలో జీవించిన విద్యాబాల‌న్..ట్రైల‌ర్

'శ‌కుంత‌లా దేవి' పాత్రలో జీవించిన విద్యాబాల‌న్..ట్రైల‌ర్

అందాల తార వి‌ద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం శకుంతలా దేవి.  హ్యూమన్‌ కంప్యూటర్‌గా పేరుగాంచిన శకుంతల జీవితం ఆధారంగా ఈ మూవీ వస్తోంది. ఈ మూవీ ట్రైల‌ర్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. ట్ర‌ల‌ర్ లో విద్యాబాల‌న్..శ‌‌‌కుంత‌లా దేవిగా డిఫ‌రెంట్ షేడ్స్ లో ఉన్న పాత్ర‌లో క‌నిపిస్తూ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటోంది. ఈ చిత్రంలో మ‌రో బాలీవుడ్ న‌టి స‌న్యా మ‌ల్హోత్రా కీల‌క పాత్ర‌లో న‌టించింది.

అనూ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ మూవీని జులై 31న విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్ష‌కుల ముందుకురానుంది. logo