Cinema
- Dec 01, 2020 , 00:37:31
షకీలా జీవన చిత్రం

దక్షిణాదిలో ఒకనాడు శృంగార తారగా పేరు తెచ్చుకుంది షకీలా. తొంభై దశకంలో మలయాళ చిత్రసీమలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అక్కడి అగ్ర హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకొని వార్తల్లో నిలిచింది. షకీలా నటించిన కొన్ని సినిమాలు వందరోజుల పాటు ప్రదర్శింపబడ్డాయి. అయితే కొద్దికాలానికి ఆమె ప్రాభవం తగ్గిపోయింది. మలయాళ పరిశ్రమలోని పెద్దల కుట్రల వల్లే ఆమె కెరీర్ పతనమైందనే విమర్శలొచ్చాయి. అనేక ఎత్తుపల్లాలతో సాగిన షకీలా జీవితం ఆధారంగా బాలీవుడ్లో ‘షకీలా’ పేరుతో సినిమా తెరకెక్కుతోంది. రిచాచద్దా టైటిల్ రోల్‌ని పోషిస్తోంది. ఇంద్రజిత్ లంకేష్ దర్శకుడు. ఈ సినిమా పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. తుపాకీ చేతబూని ఎర్రచీరలో షకీలా చిత్ర కొత్త పోస్టర్ అందరిలో ఆసక్తినిరేకెత్తిస్తోంది. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.
తాజావార్తలు
- మహిళలు, పిల్లలపై హింసను ఎదుర్కొనేందుకు 'సంఘమిత్ర'
- బిజినెస్ ఫ్రెండ్లీకి దెబ్బ: ‘మహా’ సర్కార్‌కు జీఎం వార్నింగ్!
- పాలమూరు-రంగారెడ్డి’ని ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలి : సీఎం కేసీఆర్
- 2020 లో జీవితం ఇంతేనయా! చిన్నారులు పాపం..
- దిగివచ్చిన బంగారం ధరలు
- రేపు సర్వార్థ సంక్షేమ సమితి 28వ వార్షికోత్సవాలు
- కేంద్ర బడ్జెట్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్
- 2020 బెస్ట్ సెల్లింగ్ మారుతి ‘స్విఫ్ట్’
- రైతుల ట్రాక్టర్ పరేడ్‌కు అనుమతి
- ఇక నుంచి వీళ్లూ పన్నుకట్టాల్సిందే...?
MOST READ
TRENDING