శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 02, 2020 , 13:50:45

'అది కొట్టిన దెబ్బ‌ల‌కు దిమ్మ తిరిగింది'..ఫ‌న్ గా టీజ‌ర్

'అది కొట్టిన దెబ్బ‌ల‌కు దిమ్మ తిరిగింది'..ఫ‌న్ గా టీజ‌ర్

త‌న‌దైన కామెడీ ట‌చ్ తో అంద‌రిని అల‌రించే ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా న‌టిస్తోన్ చిత్రం బొమ్మ అదిరింది- దిమ్మ తిరిగింది. అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ హారర్ కామెడీ ఎంట‌ర్ టైనర్ గా వ‌స్తోన్న ఈ చిత్ర టీజ‌ర్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. టీజ‌ర్ ఫ‌న్నీగా, స‌స్పెన్స్ గా ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతూ ఆక‌ట్టుకుంటోంది. రాత్రి అది కొట్టిన దెబ్బ‌ల‌కు నాకు బొమ్మ అదిరిపోయి దిమ్మ తిరిగింది అంటూ  శంక‌ర్ చెప్తున డైలాగ్స్ అల‌రిస్తున్నాయి.  టీజ‌ర్ చూస్తుంటే థియేట‌ర్ కు వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌కు ఎంట‌ర్ టైన్ మెంట్ ఖాయ‌మనిపిస్తోంది. కుమార్ కోట  ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్రియ, అర్జున్ కళ్యాణ్, రాజు స్వరూప్, స్వాతి కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. 

టైటిల్ తోనే అటు మాస్ ఆడియెన్స్ లో ఇటు క్లాస్ అడియెన్స్ లో అనూహ్య స్పంద‌న తెచ్చుకున్న ఈ చిత్ర యూనిట్ తాజాగా ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేశారు. ఇక‌ ఈ సినిమాతో కుమార్ కోట దర్శకునిగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నారు. మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాతలు లుకాలపు మధు, దత్తి సురేష్ బాబు, సోమేశ్ ముచ‌ర్ల ఈ ప్రాజెక్టును తెర‌కెక్కిస్తున్నారు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.