బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 25, 2020 , 11:11:28

కాజోల్ చాలా చెడ్డ‌ద‌ని అమీర్‌కి చెప్పిన షారూఖ్‌..!

కాజోల్ చాలా చెడ్డ‌ద‌ని అమీర్‌కి చెప్పిన షారూఖ్‌..!

బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్, కాజోల్ ది ఎంత హిట్ పెయిర్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే చిత్రంలో వీర‌ద్ద‌రిని చూసి ఎంతో మంది ప్రేమికులు మురిసిపోయారు. కాని ఒకానొక సంద‌ర్భంలో షారూఖ్‌.. అమీర్ ఖాన్‌తో కాజోల్ గురించి చాలా చెడ్డ‌గా చెప్పాడ‌ట‌. ఈ విష‌యాన్ని షారూఖ్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశాడు.

నేను కాజోల్ బాజీగ‌ర్ చిత్రంలో న‌టిస్తున్న‌ప్పుడు అమీర్‌.. కాజోల్‌తో క‌లిసి పని చేయాల‌నుకుంటున్నాన‌ని నాతో అన్నాడు. ఆ స‌మ‌యంలో కాజ‌ల్ చెడ్డ‌ది. న‌ట‌న‌పై అస్స‌లు దృష్టి పెట్ట‌దు. మీరు ఆమెతో క‌లిసి ప‌నిచేయ‌లేరు అని అమీర్‌కి సందేశాన్ని పంపిప‌న‌ట్టు షారూఖ్ పేర్కొన్నారు. అయితే సాయంత్రం ర‌షెస్ చూసి కాజోల్‌ని అపార్ధం చేసుకున్న‌ట్టు అమీర్‌కి ఫోన్ చేసి చెబుదామ‌ని ప్ర‌య‌త్నించ‌గా, లిఫ్ట్ చేయ‌లేదు. ‌కాని త‌ర్వాత అమీర్  ఓ మాట అన్నాడు. అదేమిటో నాకు తెలియదు కానీ.. ఆమె తెరపై కనిపిస్తున్నంత సేపూ ఏదో మాయాజాలం మత్తు చల్లుతోంది అని అమీర్ ఖాన్ నాతో చెప్పాడు అని షారూఖ్ స్ప‌ష్టం చేశారు. గ‌తంలో షారూఖ్ చెప్పిన ఈ మాట‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.


logo