గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Oct 30, 2020 , 18:32:57

జీవితాంతం ఆ మూడు ఉంటే చాలు : షారూఖ్‌

జీవితాంతం ఆ మూడు ఉంటే చాలు : షారూఖ్‌

బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్‌కు ఫుడ్ అంటే ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. ఏది ఎలా ఉన్నా సరే ఆహారం విషయంలో మాత్రం ఆయ‌న కంఫర్ట్ కోరుకుంటారు. అలాంటి షారుఖ్ కేవ‌లం ఓ మూడు ర‌కాల ఆహారాలు ఉంటే చాలు.. మిగిలిన జీవితమంతా గ‌డిపేస్తానని అంటున్నాడు.  

ఈ విష‌యాన్ని #AskSRK అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్లో నెటిజ‌న్లు అడుగుతున్న‌ ప్రశ్నలకు కింగ్ ఖాన్ సమాధానాలిస్తున్నారు. అయితే అందులో ఓ  నెటిజ‌న్ షారుఖ్ ను ఓ విచిత్రమైన ప్రశ్న అడిగాడు. అదేంటంటే.. 'మిగిలిన జీవితమంతా ఒక మూడు రకాల ఫుడ్స్ మాత్రమే తినాలంటే మీరు ఏం ఎంచుకుంటారు?' అని. ఈ ప్ర‌శ్న‌కు షారుఖ్ స్పందిస్తూ.. 'పప్పు, అన్నం, ఉల్లిపాయలు' అని సింపుల్ గా సమాధానం చెప్పాడు. 

దీనిపై మ‌రో నెటిజ‌న్ స్పందిస్తూ.. వంట నేర్చుకున్నారా? అని అడిగాడు. దీనికి షారుఖ్ "ఏమో నిజానికి ఉప్పు ఎంత వేయాలో అనేది ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది" అంటూ చాలా సరదాగా జ‌వాబు చెప్పాడు. 

అయితే షారుఖ్ ఖాన్‌కు వంట చేయ‌డ‌మంటే మ‌హా ఇష్టం.. అలా 2019లో పిల్ల‌ల కోసం ఇటాలియ‌న్ ఫుడ్ షోలో వంట చేస్తూ క‌నిపించారు. ఆ ఫుడ్ షో పేరు మై నెక్స్ట్ గెస్ట్ విత్ డేవిడ్. లెటర్‌మ్యాన్. 

ఇక మ‌రో యువ‌తి షారుఖ్‌ను ఇలా అడిగింది. జీవితం గురించి ఏదైనా స‌ల‌హా ఇవ్వండి అని అడిగింది. అందుకు ఆయ‌న ఇలా బదులిచ్చారు. నిన్ను నిరుత్సాహపరిచే నెగెటివిటీని దూరం పెట్టు. నువ్వు నీలా ఉంటేనే అందంగా ఉండగలవు అని చెప్పాడు. 

మొత్తానికి సోష‌ల్ మీడియాలో అభిమానుల‌కు, నెటిజ‌న్ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌గా ఉండే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు షారుఖ్‌. నెటిజ‌న్లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌ర‌దాగా జోకులు, కౌంట‌ర్లు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నాడు.