e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home News మెగా డైరెక్టర్ తో షారుక్ ఖాన్ పర్ఫెక్ట్ కమ్ బ్యాక్

మెగా డైరెక్టర్ తో షారుక్ ఖాన్ పర్ఫెక్ట్ కమ్ బ్యాక్

ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా కూడా కెరీర్ లో కొన్ని సార్లు ఇబ్బంది పడతాడు. వరుస పరాజయాలతో సతమతమవుతుంటాడు. ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుక్‌ ఖాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కొన్నేళ్లుగా ఆయన నటించిన సినిమాల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. ఇంకా చెప్పాలంటే మూడేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయలేదు షారుక్. ఈయన చివరి సినిమా జీరో 2018లో సినిమా విడుదలైంది. ఇందులో మరుగుజ్జు పాత్రలో నటించాడు షారుక్ ఖాన్. ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీని ముందు నటించిన సినిమాలు కూడా దారుణంగా నిరాశపరిచాయి.

2013లో రోహిత్ శెట్టి తెరకెక్కించిన చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత బాద్షా సరైన విజయం అందుకోలేదు. హ్యాపీ న్యూ ఇయర్ కమర్షియల్ గా హిట్ అయినా కూడా అది షారుక్ రేంజ్ కాదు. దాంతో మూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు ఈ హీరో. నెక్స్ట్ సినిమా ఎప్పుడు అంటూ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నా కూడా దీనిపై ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. సరైన కథతో పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో పఠాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇండియాలో ఉన్న అత్యుత్తమ దర్శకులలో ఈయన అందరికంటే ముందు ఉంటాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజు.. ఇలా ఒక్కొక్క సినిమా ఒక్కో కళాఖండం. ఇలాంటి దర్శకుడు షారుక్ ఖాన్ తో సినిమా చేస్తే వచ్చే ఫలితం ఎలా ఉంటుందో అభిమానులకు బాగా తెలుసు. దానికి తోడు తన కెరీర్ గాడి తప్పుతున్న సమయంలో రాజ్ కుమార్ హిరానీ లాంటి దర్శకుడితో పనిచేయడం అత్యవసరంగా భావిస్తున్నాడు కింగ్ ఖాన్. ఈ సినిమాలో మనోజ్ బాజ్ పేయి, బొమన్ ఇరానీ, విద్యా బాలన్, తాప్సీ కీలక పాత్రల్లో నటించబోతున్నారు. 2022 చివర్లో ఈ సినిమా పట్టాలెక్కనుంది.

ఇవి కూడా చదవండి..

శాకుంత‌లంలో పాపుల‌ర్ టీవీ హోస్ట్

టైగ‌ర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖ‌ర్చు..!

కేసు గెలిస్తే కారు నుంచి బైకుకు వ‌చ్చాడు..‘తిమ్మ‌రుసు’ ట్రైల‌ర్

ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్ర‌మే తెలుసు: స‌త్య‌దేవ్‌

త‌రుణ్‌, ఉద‌య్‌కిర‌ణ్‌తో న‌న్ను పోల్చొద్దు: వ‌రుణ్ సందేశ్‌

ప్రియ‌మణి-ముస్త‌ఫారాజ్ వివాహం చెల్ల‌దు..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana