ఆదివారం 07 జూన్ 2020
Cinema - Apr 04, 2020 , 22:54:51

క్వారంటైన్‌ కేంద్రానికి ఆఫీసు అప్పగింత

క్వారంటైన్‌ కేంద్రానికి ఆఫీసు అప్పగింత

కరోనాపై పోరులో ప్రభుత్వాలకు చేయూతగా బాలీవుడ్‌ బాద్షా షారుఖ్‌ఖాన్‌ పలు సేవా కార్యక్రమాల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. పీఎం కేర్స్‌కు నిధులతో పాటు యాభైవేల రక్షణ కిట్ల పంపిణీ, ముంబయిలో 6000కుటుంబాలకు రోజువారి భోజన ఖర్చులు, ఢిల్లీలో 3000మందికి నిత్యవసరాల్ని సమకూర్చడం వంటి అనేక కార్యక్రమాలు ఆయన చారిటీలో ఉన్నాయి. తాజాగా ఆయన ముంబయిలో కరోనా అనుమానితుల క్వారంటైన్‌ సదుపాయం కోసం నాలుగు అంతస్తుల తన ఆఫీస్‌ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు తెలిపారు. సంక్షిష్ట పరిస్థితుల్లో  సేవా కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేయాలనే ఆలోచనతో వ్యక్తిగత ఆఫీస్‌ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తున్నామని, మహిళలు, పిల్లలకు ఇది సౌకర్యంగా ఉంటుందని షారుఖ్‌ఖాన్‌ పేర్కొన్నారు. ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ  షారుఖ్‌ కనబరచిన ఔదార్యానికి బృహన్‌ ముంబయి మునిసిపల్‌ కార్పొరేషన్‌ కృతజ్ఞతలు తెలిపింది.logo