బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 17:32:42

ఫొటోగ్రాఫ‌ర్ గా మారిన మీరా రాజ్‌పుత్‌..స్టిల్స్ వైర‌ల్‌

ఫొటోగ్రాఫ‌ర్ గా మారిన మీరా రాజ్‌పుత్‌..స్టిల్స్ వైర‌ల్‌

సోష‌ల్ మీడియాలో షాహిద్ క‌పూర్ భార్య మీరా రాజ్ పుత్ యాక్టివ్ గా ఉంటుంద‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎప్ప‌టిక‌పుడు త‌న ఫ్యామిలీ వెకేష‌న్ స్టిల్స్ ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. సంప్ర‌దాయ‌క లుక్ లోనైనా, ట్రెండీ కాస్ట్యూమ్స్ లోనైనా త‌న‌కెవ‌రూ పోటీ రార‌ని ఫొటోల ద్వారా నిరూపిస్తుంది. ఈ రాజ్‌పుత్ బ్యూటీ ఫొటోగ్రాఫ‌ర్ గా మారింది. త‌న ఇంట్లో స‌ర‌దా స‌న్నివేశాలు, మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను కెమెరాలో బంధించింది. 

మీరా రాజ్‌పుత్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా కొన్ని ఫొటోలు ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మీరా కెమెరా చేత‌ప‌ట్టుకుని త‌న పిల్ల‌లు బీచ్ లో ఆడుకుంటున్న‌పుడు, ఇంట్లో పెద్ద‌వాళ్ల‌తో స‌ర‌దాగా కాల‌క్షేపం చేస్తున్న‌పుడు, ఇంటి ప్రాంగణంలో ఇత‌ర పిల్ల‌ల‌తో క‌లిసి ఆడుకుంటున్న‌పుడు ఫొటోలు తీసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందాల భామ ఫొటోగ్రాఫ‌ర్ గా  మారి తీసిన స్టిల్స్ నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.