e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home News షాహిద్ క‌పూర్ కు ఎంత‌మందితో లవ్ ఎఫైర్ ఉందో తెలుసా..?

షాహిద్ క‌పూర్ కు ఎంత‌మందితో లవ్ ఎఫైర్ ఉందో తెలుసా..?

సినీ ప‌రిశ్ర‌మ లో ల‌వ్ ఎఫైర్లు స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యమే. ప్ర‌త్యేకించి బాలీవుడ్ యాక్ట‌ర్ల‌లో ఎవ‌రు ఎవ‌రితో ఎంత కాలం ప్రేమాయ‌ణం న‌డిపిస్తారో చెప్ప‌డం క‌ష్ట‌మైన ప‌నే. బాలీవుడ్ హీరోల్లో డిఫ‌రెంట్ స్టైల్‌లో ల‌వ్ జ‌ర్నీని కొన‌సాగించిన వాళ్లకు కొద‌వేమి లేదు. ఈ జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటాడు యువ హీరో షాహిద్ క‌పూర్‌. సినీ కెరీర్‌లో చాలా ఆల‌స్యంగా స‌క్సెస్ అందుకున్న న‌టుల్లో షాహిద్ క‌పూర్ ఒక‌డు. ఇపుడు స్టార్ హీరోగా మారి అత్య‌ధికంగా సంపాదిస్తున్న వారి లిస్టులో చేరిపోయారు. అయితే షాహిద్ ప్రేమాయ‌ణం న‌డిపిన హీరోయిన్లలో చాలా మంది పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. తాను క‌లిసి న‌టించిన హీరోయిన్ల‌తో ప్రేమ‌లో ప‌డ్డ‌ట్టు షాహిద్ క‌పూర్ త‌ర‌చూ ఏదో ఒక వార్త‌ల్లో నిలిచి బాలీవుడ్ ల‌వ‌ర్ బాయ్ గా మారిపోయాడు.

షాహిద్‌క‌పూర్, క‌రీనాకపూర్ ల‌వ్ ఎఫైర్ న‌డిచింద‌ని చాలా కాలంపాటు మీడియాలో వ‌చ్చింది. జ‌బ్ వి మెట్‌, చుప్ చుప్ కే, ఉడ్తా పంజాబ్ తోపాటు ప‌లు చిత్రాల్లో క‌లిసి న‌టించిన షాహిద్, క‌రీనా కొంత కాలం ప్రేమాయ‌ణం సాగించారు. ఆ త‌ర్వాత కిస్మ‌త్ క‌నెక్ష‌న్ సినిమాతో షాహిద్ క‌పూర్‌, విద్యాబాల‌న్ ల ల‌వ్‌స్టోరీ తెర‌మీదకు వ‌చ్చింది. షాహిద్, విద్యాబాల‌న్ పెండ్లి పీట‌లెక్క‌డం ఖాయ‌మ‌ని అంతా అనుకునే లోపే వారి బ్రేక‌ప్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. షాహిద్‌క‌పూర్ దురుసుత‌నం వ‌ల్ల ఇద్ద‌రికీ బ్రేక‌ప్ అయ్యింద‌ని వారి స‌న్నిహితులు చెప్పుకొచ్చారు.

- Advertisement -

ఓ సంద‌ర్భంలో విద్యాబాల‌న్ వెయిట్ గురించి కామెంట్ చేశాడ‌ట షాహిద్‌. ఈ కామెంట్లు రిపీట్ అయ్యే స‌రికి ఒక‌రిపై ఒక‌రికి గౌర‌వం లేని చోట ప్రేమ ఉండ‌బోదని గ్ర‌హించిన విద్యాబాల‌న్ ల‌వ్ లైఫ్ కు గుడ్ బై చెప్పి..త‌న కెరీర్ పై ఫోక‌స్ పెట్టింద‌ట‌. అత‌ని మీదున్న ఇష్టాన్ని అలుసుగా తీసుకుని త‌న‌లోని లోపాల‌ను ఎత్తిచూపుతూ వెట‌కార‌మాడుతుంటే భ‌య‌మేసి రిలేష‌న్ షిప్ లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశానంటూ ఓ ఇంట‌ర్య్వూలో షాహిద్ క‌పూర్ గురించి చెప్పుకొచ్చింది విద్యాబాల‌న్. అయిదే అనంత‌రం షాహిద్ క‌పూర్ మ‌రో ఇంట‌ర్వ్యూలో స్పందిస్తూ..నా కోస్టార్స్ లో ఇద్ద‌రిని చాలా ఇష్ట‌ప‌డ్డాను. ఆ ఇద్దరిలో ఒక‌రు క‌రీనాక‌పూర్ కాగా..ఇంకొక‌రు ప్రియాంకా చోప్రానా..? విద్యాబాల‌న్ అయి ఉంటుందా..? అనే దానిపై మాత్రం సస్పెన్స్ వీడ‌లేదు.

షాహిద్ క‌పూర్ ప్రేమాయ‌ణం సాగించిన హీరోయిన్ల జాబితాలో సోనాక్షిసిన్హా, అమృత‌రావు ల పేర్లు కూడా తెర‌పైకి వ‌చ్చాయి. మొత్తానికి వీరందిలో షాహిద్‌క‌పూర్ కు విద్యాబాల‌న్ పై ఎంత ప్రేముందో తెలియ‌దు కానీ..విద్యాబాల‌న్ మాత్రం షాహిద్ ను చాలా ప్రేమించింది. షాహిద్ క‌పూర్ ను పెండ్లి చేసుకునే ముందుగా మీరారాజ్‌పుత్ విద్యాబాల‌న్ మ‌న‌సులో ఇంకా షాహిద్ ఉన్నాడ‌ని ఆరా తీసింద‌ట‌. ఈ ఒక్క విష‌యంతో విద్యాబాల‌న్- షాహిద్ ను ఎంతగా ప్రేమించో చెప్పేందుకు ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. మొత్తానికి ల‌వర్ బాయ్ షాహిద్ రాజ్ పుత్ సుంద‌రి మీరా రాజ్‌పుత్ ను పెండ్లి చేసుకుని ప్రేమ క‌థ‌ల‌న్నింటికి ఫుల్‌స్టాప్ పెట్టేశాడు.

ఇవి కూడా చదవండి..

కొత్తింట్లోకి ‘రాఖీభాయ్‌’..ఫొటోలు వైర‌ల్‌

రోజుకు ఎన్ని సిగ‌రెట్లు తాగుతారు..ర‌ష్మిక‌కు అభిమాని ప్ర‌శ్న‌

నాలో మూడు మార్పులొచ్చాయి : స‌మంత‌

వెకేష‌న్ డేస్‌ను గుర్తు చేసుకున్న ర‌కుల్‌..స్టిల్స్ వైర‌ల్‌

ప్ర‌భాస్ టు సాయిప‌ల్ల‌వి..సౌతిండియా స్టార్లు ఏం చ‌దివారో తెలుసా..?

ఫాలోవ‌ర్లు, ఫ్యాన్స్ కు కొర‌టాల శివ షాక్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana