శనివారం 08 ఆగస్టు 2020
Cinema - Jul 14, 2020 , 12:34:51

అలియా భ‌ట్ సోద‌రికి బెదిరింపులు..స్క్రీన్ షాట్స్ షేర్ చేసిన షాహీన్

అలియా భ‌ట్ సోద‌రికి బెదిరింపులు..స్క్రీన్ షాట్స్ షేర్ చేసిన షాహీన్

సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లో న‌ట‌వార‌స‌త్వంపై హాట్ హాట్ చ‌ర్చ‌లు జ‌రిగాయి. కొంద‌రు ప్ర‌ముఖుల వ‌ల‌న టాలెంట్ ఉన్న చాలా మంది ప‌రిస్థితి అగమ్య‌గోచ‌రంగా మారింద‌ని చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌లో మాఫియా ఉంద‌ని దాని వ‌ల‌నే సుశాంత్ మ‌ర‌ణించాడంటూ కంగ‌నాతో పాటు ప‌లువురు త‌న వాద‌న‌లు వినిపించారు. ఈ నేప‌థ్యంలో కపూర్స్.. ఖాన్స్.. భట్స్ ఇలా కొంద‌రు పేరు మోసిన ప్ర‌ముఖుల‌ని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం త‌మ ఫ్యామిలీపై ఆరోప‌ణ‌లు చేస్తున్న నేప‌థ్యంలో పూజా భ‌ట్ స్పందించింది. కంగ‌నా లాంటి వాళ్ల‌ని ప‌రిచయం చేసింది మేమే అనే స‌రికి వెంట‌నే రెస్పాండ్ అయిన కంగ‌నా టీం వారికి షాకింగ్ స‌మాధానం ఇచ్చింది. ఇక రీసెంట్‌గా మ‌హేష్ భ‌ట్ కుమార్తె, అలియా సోద‌రి షాహిన్‌కి కొంద‌రు నెటిజ‌న్స్ నుండి వేధింపులు ఎదుర‌య్యాయ‌ట‌. షాహీన్ చంపేస్తామ‌ని, రేప్ చేస్తామంటూ పోస్ట్‌లు పెడుతున్నార‌ట‌. వీటికి  సంబంధించిన స్క్రీన్ షాట్లను షాహీన్ షేర్ చేశారు.  ఈ తరహా విద్వేష పూరిత బెదిరింపుల్ని సీరియస్ గా తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని షాహీన్ వెల్లడించారు. గుర్తు తెలియ‌ని సైట్ల నుండి బెదిరింపులు చేసినా కూడా ఐపీ అడ్రెస్‌లతో వారిని గుర్తించ‌డం ఖాయ‌మ‌ని షాహీన్ అంటుంది.  


logo