మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 24, 2020 , 11:55:43

అట్లీ చిత్రంలో డ్యూయ‌ల్ రోల్ పోషించ‌నున్న షారూఖ్..!

అట్లీ చిత్రంలో డ్యూయ‌ల్ రోల్ పోషించ‌నున్న షారూఖ్..!

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ జీరో సినిమా త‌ర్వాత సినిమాల‌కు చాలా దూరంగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్‌తో బిజీబిజీగా గడుపుతున్న షారూఖ్ త్వ‌ర‌లో అట్లీతో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్స్ జ‌రుగుతుండ‌గా, వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

తాజాగా అట్లీ- షారూఖ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రంలో షారూఖ్ డ్యూయ‌ల్ రోల్ పోషించ‌నున్నాడ‌ని చెబుతున్నారు. రా ఆఫీస‌ర్ తండ్రి,కొడుకు పాత్ర‌ల‌లో షారూఖ్ ఖాన్ కనిపించి ప్రేక్ష‌కుల‌ని ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. షారూఖ్ డ్యూయ‌ల్ రోల్ లో క‌నిపించ‌నున్నాడు అనే స‌రికి ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.