శనివారం 06 జూన్ 2020
Cinema - Apr 25, 2020 , 23:12:26

తొలినాళ్లలో గిల్లికజ్జాలు

తొలినాళ్లలో గిల్లికజ్జాలు

బాలీవుడ్‌ వెండితెరపై షారుఖ్‌ఖాన్‌-కాజోల్‌ జోడీ  తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు. వీరిద్దరూ కలిసి ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ ‘బాజీఘర్‌' ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’  వంటి జనరంజక చిత్రాల్లో నటించారు. అయితే కెరీర్‌ తొలినాళ్లలో ఈ సూపర్‌స్టార్స్‌ మధ్య అంత సఖ్యత ఉండేది కాదట. నటనాపరంగా కూడా అభిప్రాయభేదాలుండేవట. ఓ సందర్భంలో కాజోల్‌తో కలిసి నటించొద్దని అమీర్‌ఖాన్‌ను హెచ్చరించాడట షారుఖ్‌ఖాన్‌. ‘బాజీఘర్‌' సెట్‌లో షారుఖ్‌ఖాన్‌ను కలిసిన అమీర్‌ఖాన్‌ ఆ సినిమాలో కాజోల్‌ యాక్టింగ్‌ ఎలా ఉందని అడిగాడట. బాగుందని చెబితే తన తదుపరి సినిమాలో నాయికగా ఎంచుకోవాలన్నది అమీర్‌ఖాన్‌ ఆలోచన. అయితే కాజోల్‌కు ఏమాత్రం యాక్టింగ్‌ స్కిల్స్‌ లేవని, ఆమెతో నటించడం చాలా కష్టంగా ఉందని అమీర్‌తో చెప్పాడట షారుఖ్‌. అంతేకాదు ఆమెతో కలిసి సినిమా చేసే ఆలోచన ఉంటే విరమించుకోవాలని సూచించాడట. అదే సమయంలో కాజోల్‌ సైతం తన సన్నిహితుల వద్ద షారుఖ్‌ నటన ఏమాత్రం నచ్చడం లేదని చెప్పేదట. అయితే కాలక్రమంగా వచ్చిన పరిణితితో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తొలిగిపోయాయి. పరస్పర గౌరవం, అభిమానం పెరిగాయి. అనంతరకాలంలో బాలీవుడ్‌లోనే హిట్‌ పెయిర్‌గా ఈ జంట నిలిచింది.

Previous Article రాశి ఫలాలు
Next Article వాస్తు

logo