శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Jun 28, 2020 , 14:48:12

షారూఖ్ ఖాన్ 28 ఏళ్ళ సినీ ప్ర‌యాణం

షారూఖ్ ఖాన్ 28 ఏళ్ళ సినీ ప్ర‌యాణం

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్  నేటితో త‌న 28 ఏళ్ళ సినీ ప్ర‌యాణం పూర్తి చేసుకున్నాడు.  1992లో రాజ్ క‌న్వ‌ర్ రొమాంటిక్ డ్రామా దీవానాతో న‌టుడిగా ఆరంగేట్రం చేసిన ఆయ‌న కెరీర్‌లో ఎన్నో అద్బుత‌మైన సినిమాలు చేశారు. బాజీఘ‌ర్‌, డ‌ర్‌, కుచ్ కుచ్ హోతా హై, క‌ల్ హో న క‌హో, మే హూనా, వీర్ జారా, మై నేమ్ ఈజ్ ఖాన్, చ‌క్ దే ఇండియా ఇలా ఎన్నో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల‌లో న‌టించారు. 1995లో షారూఖ్- కాజోల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన దిల్‌వాలే దుల్హ‌నియా లే జాయేంగే చిత్రం ఇండియ‌న్ సినిమా చరిత్ర‌లో అత్య‌ధిక రోజులు న‌డిచిన చిత్రంగా రికార్డు సాధించింది.

కెరీర్‌లో 28 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా షారూఖ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ లో ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశాడు. నా అభిరుచి నా ల‌క్ష్యంగా మారింది. అదే వృత్తిగా మారింది. ఇలా ఎలా జ‌రిగిందో తెలియ‌దు. మిమ్మ‌ల్ని అల‌రించే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు.  నా వృత్తి నైపుణ్యం కంటే,  నా అభిరుచి మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని నేను నమ్ముతున్నాను. 28 సంవత్సరాలు పూర్త‌య్యాయి.  ఈ ఫోటో తీసినందుకు గౌరీఖాన్‌కి కృత‌జ్ఞ‌తలు అని షారూఖ్ పేర్కొన్నారు. జీరో సినిమా త‌ర్వాత మ‌రో మూవీ చేయని ఎస్ఆర్కే త్వ‌ర‌లో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నారు.


logo