శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 26, 2020 , 10:15:51

సెప్టెంబ‌ర్ 25.. టాలీవుడ్‌కు చీక‌టి రోజు

సెప్టెంబ‌ర్ 25.. టాలీవుడ్‌కు చీక‌టి రోజు

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల‌న ఈ ఏడాది ఎంద‌రో జీవితాలు దుర్భ‌రంగా మారాయి. సినీ ఇండ‌స్ట్రీ విషయానికి వ‌స్తే లెజండ‌రీ న‌టులు, సింగర్స్, ద‌ర్శ‌కులు ఇదే సంవ‌త్సరంలో క‌న్నుమూసారు. ఇక సెప్టెంబ‌ర్ 25 మ‌ధ్యాహ్నం 1.04ని.లకు గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం తుది శ్వాస విడిచారు. దాదాపు 40 రోజుల పాటు మ‌ర‌ణంతో పోరాడిన బాలు చివ‌ర‌కు తిరిగి రాని లోకాల‌కు వెళ్లారు. ఆయ‌న మ‌ర‌ణంతో యావత్ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మ‌రి కొద్ది సేప‌ట్లో బాలు అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నుండ‌గా, ఆయ‌న‌ను క‌డ‌సారి చూసేందుకు అభిమానులు, ప్ర‌ముఖులు బారులు తీరుతున్నారు. 

ఇక ఇదిలా ఉంటే స‌రిగ్గా ఏడాది క్రితం అంటే సెప్టెంబ‌ర్ 25,2019న టాలీవుడ్ ప్ర‌ముఖ హాస్య న‌టుడు వేణు మాధ‌వ్ అనారోగ్య స‌మస్య‌తో క‌న్నుమూసారు.  ఆయ‌న మృతితో సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాద ఛాయ‌లు నెల‌కొన్నాయి. వేణు మాధ‌వ్ కూడా ఎన్నో ద‌శాబ్ధాల పాటు త‌న కామెడీతో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బ న‌వ్వించారు. సెప్టెంబ‌ర్ 25న ఇద్ద‌రు ప్ర‌ముఖులు మ‌ర‌ణించడం యాధృచ్చిక‌మే అయిన‌ప్ప‌టికీ ఆ రోజును చీక‌టి రోజుగా అభివ‌ర్ణిస్తున్నారు సినీ ప్రియులు