గురువారం 04 జూన్ 2020
Cinema - Feb 11, 2020 , 12:46:29

ప్రఖ్యాత సినీ జ‌ర్న‌లిస్ట్‌ ప‌సుపులేటి క‌న్నుమూత‌

ప్రఖ్యాత సినీ జ‌ర్న‌లిస్ట్‌ ప‌సుపులేటి క‌న్నుమూత‌

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవికి ఎంతో ఆప్తుడు అయిన  సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌, సినీ పీఆర్ఓ ప‌సుపులేటి రామారావు కొద్ది సేప‌టి క్రితం క‌న్నుమూశారు. దాదాపు 5 ద‌శాబ్ధాలపాటు సినీ జ‌ర్న‌లిస్ట్‌గా ప‌ని చేసిన ఆయ‌న ఎన్నో పుస్త‌కాలు కూడా ర‌చించారు. మొద‌ట విశాలాంధ్ర ప‌త్రిక‌కి జ‌ర్న‌లిస్ట్‌గా ప‌ని చేసిన పసుపులేటి ప్ర‌స్తుతం సంతోషం ప‌త్రిక‌కి జ‌ర్న‌లిస్ట్‌గా ప‌ని చేస్తున్నారు. ఎన్నో సినిమాల‌కి పీఆర్ఓగా కూడా ప‌నిచేసిన అనుభ‌వం ఆయ‌న‌ది. ప‌సుపులేటి రామారావు స్వ‌స్థ‌లం ఏలూరు కాగా, ఆయ‌న సీనియ‌ర్ ఎన్టీఆర్ నుండి బాల‌కృష్ణ‌, చంద్ర‌మోహ‌న్‌, నాగార్జున వెంక‌టేష్‌, చిరంజీవి ఇలా చాలా మంది హీరోల‌ని ఇంట‌ర్వ్యూలు చేశారు. ఆయ‌న మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేశారు


logo