ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 21:13:14

త్రిష హార్రర్ కామెడీ..సీనియ‌ర్ న‌టి కీ రోల్‌

త్రిష హార్రర్ కామెడీ..సీనియ‌ర్ న‌టి కీ రోల్‌

సుదీర్ఘ విరామం తర్వాత ద‌క్షిణాది బ్యూటీ త్రిష హార్ర‌ర్ కామెడీ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించేందుకు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని డెబ్యూట్ డైరెక్ట‌ర్ దీప‌క్ తెర‌కెక్కిస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్న ఈ ప్రాజెక్టులో సీనియ‌ర్ న‌టి రాధిక ఈ మూవీలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. పాపుల‌‌ర్ క‌మెడియ‌న్ యోగిబాబు కూడా కీ రోల్ లో క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డికానున్నాయి.

విజ‌య్ సేతుప‌తి, త్రిష కాంబినేష‌న్ లో ఇప్ప‌టికే 96 చిత్రం రాగా..బాక్సాపీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మ‌రోసారి ఈ క్రేజీ కాంబినేష‌న్ తెర‌పై సంద‌డి చేయ‌నుండ‌టంతో అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo