శనివారం 04 జూలై 2020
Cinema - Jun 06, 2020 , 08:43:15

ఐసీయూలో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు

ఐసీయూలో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు

జేడీ చక్ర‌వ‌ర్తి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన గులాబీ చిత్రంలోని సాంగ్స్ అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఎవ‌ర్‌గ్రీనే. అందులోని ప్ర‌తి సాంగ్ శ్రోత‌ల‌ని పుల‌కరించేలా చేసింది. మ‌రి త‌న సంగీతంతో అంత‌గా అల‌రించిన ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు శ‌శి ప్రీతమ్ హార్ట్ ఎటాక్‌కి గుర‌య్యారు. తీవ్ర‌మైన గుండెనొప్పి రావ‌డంతో బంజారాహిల్స్‌లోని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగానే ఉన్న‌ట్టు తెలుస్తుంది.

సంగీతంతో సంచ‌ల‌నాలు సృష్టించిన శ‌శి ప్రీత‌మ్..  గులాబి, సముద్రం, రాఘవ వంటి చిత్రాలకు సంగీతం అందించారు . . సౌండ్ రికార్డింగ్, రిథమ్, ట్యూన్ రికార్డింగ్‌లో ఈయన దిట్ట . ఇప్పుడు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్‌తో పాటు చక్రి, అనూప్ రూబెన్స్‌లు ఈయన దగ్గర పనిచేశారు. బాలీవుడ్ చిత్రాలకు సైతం మ్యూజిక్ అందించారు శశి ప్రీతమ్.  ఈయన తెలుగులో చేసినవి చాలా తక్కువే అయినా.. టెక్నికల్‌గా చాలా మందికి మెళుకువలు నేర్పించారు. ఆయ‌న త్వ‌రగా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్ధిస్తున్నారు. 


logo