గురువారం 28 మే 2020
Cinema - May 15, 2020 , 11:56:59

ట్రాన్స్‌జెండ‌ర్స్‌కి స‌పోర్ట్‌గా ఉందాం: శేఖ‌ర్ క‌మ్ముల‌

ట్రాన్స్‌జెండ‌ర్స్‌కి స‌పోర్ట్‌గా ఉందాం: శేఖ‌ర్ క‌మ్ముల‌

ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల క‌రోనా క‌ష్ట కాలంలో ఔదార్యాన్ని చాటుతున్నారు. ఇప్ప‌టికే పారిశుద్ధ్య కార్మికుల‌తో పాటు, ట్రాన్స్ జెండ‌ర్స్‌కి త‌న వంతు సాయం అందించారు శేఖ‌ర్ క‌మ్ముల. తాజాగా ట్రాన్స్‌జెండ‌ర్స్‌కి స‌పోర్ట్‌గా ఉందాం అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 

లాక్‌డౌన్ స‌మ‌యంలో ట్రాన్స్‌జెండర్స్ ప‌డుతున్న క‌ష్టాల‌ని ఊహించ‌లేం. తిండి తిప్ప‌లు లేక వారు ప‌డుతున్న బాధ‌లు అన్నీ ఇన్నీ కావు.స‌మాజంలో వారి ప‌ట్ల ఉండే వివ‌క్ష‌, అపోహ‌లు వారిని మ‌రింత ఇబ్బందుల్లోకి నెడుతుంది. అడ్ర‌స్‌, ఓట‌ర్ కార్డ్, రేష‌న్ కార్డ్ కూడా వారికి ఉండ‌దు. ఆరోగ్య ప‌థ‌కాలు కూడా వారికి ఉండ‌వు. ఈ స‌మ‌యంలో ట్రాన్స్ జెండ‌ర్స్‌కి  స‌పోర్ట్‌గా ఉందాం. ఎవ‌ర‌న్నా వారికి సాయం చేయాలంటే [email protected]కి మెయిల్ చేయాల‌ని కోరారు .

క‌రోనా కార‌ణంగా ట్రాన్స్ జెండ‌ర్స్‌కి ఉపాధి లేకుండా పోయింది. వారు ప‌డుతున్న ఇబ్బందుల‌ని గుర్తించిన శేఖ‌ర్ క‌మ్ముల వారికి ఆహారంతో పాటు కిరాణా సామాన్లు అందించాడు‌. ఈ విష‌యాన్ని తాను ఎక్క‌డ చెప్పుకోక‌పోయిన ,  రచన ముద్రబోయిన అనే ట్రాన్స్ జెండర్ తన ట్విట్టర్ అకౌంట్లో ఈ విష‌యాన్ని  పోస్ట్ చేసింది. అంతేగాక.. ఇలాంటి కష్టమైన సమయంలో శేఖర్ సార్ మీరు చేసిన హెల్ప్ కి కృతజ్ఞతలు.. మమ్మల్ని పట్టించుకోని మా దగ్గరికి వచ్చి హెల్ప్ చేసారు. మీలాగే మిగిలిన పెద్ద వారు కూడా స్పందించి మాలాంటి వాళ్ళని ఆదుకోవాలని కోరారు.


logo