గురువారం 13 ఆగస్టు 2020
Cinema - Aug 01, 2020 , 11:57:40

ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ములకు పితృ వియోగం

ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ములకు పితృ వియోగం

ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య (89)  శ‌నివారం ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో ఆసుపత్రిలో క‌న్నుమూశారు. ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో ఆయ‌న‌ అంత్యక్రియలు జ‌రుగుతాయ‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. 

రొమాంటిక్ చిత్రాల‌కి కేరాఫ్ అడ్రెస్ గా మారిన శేఖ‌ర్ క‌మ్ముల ప్ర‌స్తుతం ల‌వ్ స్టోరీ అనే చిత్రాన్ని చేస్తున్నారు. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో ఈ చిత్రం రూపొందుతుంది. కాగా,  లాక్‌డౌన్ స‌మ‌యంలో అనేక సేవా కార్యక్ర‌మాలు చేశారు శేఖ‌ర్ క‌మ్ముల‌. హిజ్రాల‌కి నిత్యావ‌స‌రాలు అందించ‌డంతో పాటు జీహెచ్ఎంసీ కార్మికుల‌కి నెల రోజుల పాటు మ‌జ్జిగ‌తో పాటు ఆరోగ్యానికి సంబంధించిన‌వి అందించారు. ప్లాస్మా దానం చేయాల‌ని కూడా కోరుతున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo