బుధవారం 27 మే 2020
Cinema - Apr 27, 2020 , 16:13:06

పారిశుద్ధ్య కార్మికులకి పాలు, మ‌జ్జిగ అందించిన శేఖ‌ర్ క‌మ్ముల‌

పారిశుద్ధ్య కార్మికులకి పాలు, మ‌జ్జిగ అందించిన శేఖ‌ర్ క‌మ్ముల‌

క‌రోనా క‌ష్ట కాలంలో మ‌న ప‌రిస‌రాల‌ని శుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య కార్మికులు ప్రాణాల‌కి తెగించి మండే ఎండ‌ల‌లో ప‌ని చేస్తున్నారు. వారి కృషిని గుర్తించిన శేఖ‌ర్ క‌మ్ముల నార్త్ జోన్ జీఎచ్ఎంసీ కార్యాల‌యం వద్ద పాలు, బాదం పాలు పంపిణీ చేసారు. నెల రోజుల పాటు ప్ర‌తి రోజు వెయ్యిమంది పారిశుద్య కార్మికుల‌కి తాను పాలు, మ‌జ్జిగ ఇస్తాన‌ని అన్నారు. సికింద్రాబాద్‌లో జ‌రిగిన పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

 క‌రోనా కార‌ణంగా ట్రాన్స్ జెండ‌ర్స్‌కి ఉపాధి లేకుండా పోయింది. వారు ప‌డుతున్న ఇబ్బందుల‌ని గుర్తించిన శేఖ‌ర్ క‌మ్ముల వారికి ఆహారంతో పాటు కిరాణా సామాన్లు ఇటీవ‌ల‌ అందించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని తాను ఎక్క‌డ చెప్పుకోక‌పోయిన ,  రచన ముద్రబోయిన అనే ట్రాన్స్ జెండర్ తన ట్విట్టర్ అకౌంట్లో ఈ విష‌యాన్ని  పోస్ట్ చేసింది. అంతేగాక.. ఇలాంటి కష్టమైన సమయంలో శేఖర్ సార్ మీరు చేసిన హెల్ప్ కి కృతజ్ఞతలు.. మమ్మల్ని పట్టించుకోని మా దగ్గరికి వచ్చి హెల్ప్ చేసారు. మీలాగే మిగిలిన పెద్ద వారు కూడా స్పందించి మాలాంటి వాళ్ళని ఆదుకోవాలని కోరారు.


logo