మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 09:31:17

కరోనాకు ఆ ఇంజెక్షన్ పనిచేస్తుందేమో చూడండి : డైరెక్టర్ వినాయక్

కరోనాకు ఆ ఇంజెక్షన్ పనిచేస్తుందేమో చూడండి : డైరెక్టర్ వినాయక్

హైదరాబాద్‌ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి సినీ ప్రముఖులు తమకు తెలిసిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ఓ ఇంజెక్షన్  సోషల్‌ మీడియాలో మాట్లాడారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.  కరోనాకు ఆ ఇంజెక్షన్‌తో చెక్ పెట్టడం సాధ్యమవుతుందేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు. `గతంలో నేను ఒకసారి ఆఫ్రికాలోని కెన్యాకు వెళ్లాను. అక్కడికి వెళ్లాలంటే ఎల్లో ఫీవర్‌ను నివారించే ఇంజెక్షన్‌ను తప్పనిసరిగా వేసుకోవాలి. ఎల్లో ఫీవర్ గురించి అక్కడి డాక్టర్‌ను అడిగాను. ప్రస్తుతం కరోనా లక్షణాలుగా వేటినైతే చెబుతున్నారో.. సరిగ్గా వాటినే ఎల్లో ఫీవర్ లక్షణాలుగా చెప్పారు.

కాబట్టి ఆ ఇంజెక్షన్ కరోనాకు కూడా పనిచేస్తుందేమోనని నా అనుమానం’. అని వినాయక్‌ పేర్కొన్నారు. ఇటీవల ఇద్దరు వైద్యులు కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలలను వివరించిన విధానం వినాయక్‌ను ఎంతగానో ఆకట్టుకుందట. దీంతో నా సూచన ఆ ఇద్దరు వైద్యులకు చేరాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానని వినాయక్ చెప్పారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo