గురువారం 04 జూన్ 2020
Cinema - Jan 16, 2020 , 23:54:09

మత్స్యకారుల నేపథ్యంలో..

మత్స్యకారుల నేపథ్యంలో..

రమాకాంత్‌, భాను జంటగా నటిస్తున్న చిత్రం ‘సముద్రుడు’. నగేష్‌ నారదాసి దర్శకుడు. బదావత్‌ కిషన్‌ నిర్మాత. ఇటీవలే చీరాల ఓడరేవులో రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘మత్స్యకారుల నేపథ్యంలో వాణిజ్య అంశాల మేళవింపుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మూడు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. అతి త్వరలో పాటల్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం’ అన్నారు. సుమన్‌, రామరాజు, చిత్రం శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వాసు, సంగీతం: సుభాష్‌ఆనంద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నగేష్‌ నారదాసి.


logo