శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 12, 2020 , 14:52:43

దిశా సలియ‌న్ విచార‌ణ‌ను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

దిశా సలియ‌న్ విచార‌ణ‌ను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణించ‌డానికి కొద్ది రోజుల ముందు ఆయ‌న  మాజీ మేనేజ‌ర్ దిశ స‌లియ‌న్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దిశ ప్రియుడు రోహాన్‌ నివాసంలో జ‌రిగిన పార్టీలో దిశ తన బాయ్‌ ఫ్రెండ్‌తో పాటు, మరికొంత మందితో కలిసి పార్టీలో పాల్గొన్నారు. అనంతరం ఆమె పార్టీ జరిగిన అపార్టుమెంట్‌పై దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆమె మ‌ర‌ణంపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ ప‌లువురు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం దిశా కేసుకి సంబంధించి కోర్టులో విచార‌ణ జ‌రుగుతుండ‌గా, విచార‌ణ‌ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. పిటీష‌న‌ర్ వినీత్ దంఢా న్యాయ‌వాది వీడియో కాన్ఫ‌రెన్స్‌కు హాజ‌రు కాని కార‌ణంగా సిజెఐ ఎస్‌ఐ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పిటీష‌న్‌ను  వాయిదా వేసిన‌ట్టు పేర్కొంది..