గురువారం 04 జూన్ 2020
Cinema - May 16, 2020 , 08:12:21

త‌న డ్యాన్స్‌తో ఫిదా చేసిన స‌యేషా సైగ‌ల్‌

త‌న డ్యాన్స్‌తో ఫిదా చేసిన స‌యేషా సైగ‌ల్‌

కుర్ర హీరోయిన్ స‌యేషా సైగ‌ల్ ఇటీవ‌ల త‌మిళ న‌టుడు ఆర్య‌ని ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. స‌యేషా ప‌లు తెలుగు చిత్రాల‌లో న‌టించి అల‌రించ‌గా, త‌మిళం, హిందీ సినిమాల‌తో బిజీగా ఉంది. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్‌కి మంచి వినోదం అందిస్తుంది.

తాజాగా స‌యేషా సంప్రదాయ బద్ధంగా చేసిన ఓ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చాలా రోజుల తరువాత ఇలాంటి క్లాసికల్ డ్యాన్స్ మూవ్‌మెంట్స్ చూశామంటూ నెటిజన్లు ఆమె వీడియోను తెగ షేర్లు చేస్తున్నారు.దీంతో ఆమె డ్యాన్స్ వీడియో తెగ వైరల్‌గా మారింది.logo