శుక్రవారం 29 మే 2020
Cinema - Jan 24, 2020 , 00:56:23

ప్రేమ సవారి

ప్రేమ సవారి

నందు, ప్రియాంకశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘సవారి’. సాహిత్‌ మోత్కూరి దర్శకుడు. సంతోష్‌ మోత్కూరి, నిషాంక్‌రెడ్డి కుడితి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదలకానుంది.

‘నందులోని పోరాటతత్వం అంటే నాకు చాలా ఇష్టం. కంటెంట్‌ ఓరియెంటెడ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం హీరోగా అతడికి మంచి పేరు తీసుకురావాలి’ అని అన్నారు హీరో సుధీర్‌బాబు. నందు, ప్రియాంకశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘సవారి’.  సాహిత్‌ మోత్కూరి దర్శకుడు. సంతోష్‌ మోత్కూరి, నిషాంక్‌రెడ్డి కుడితి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదలకానుంది. ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో హీరోలు సుధీర్‌బాబు, శ్రీవిష్ణు విడుదలచేశారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం నందు పడిన కష్టానికి తప్పకుండా ప్రతిఫలం దక్కుతుందనే  నమ్మకముంది. నిజాయితీగా చిత్రబృందం చేసిన ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలి’ అని పేర్కొన్నారు. నందు మాట్లాడుతూ ‘డబ్బుల కోసం నేను చాలా సినిమాలు చేశాను. అందుకు భిన్నంగా ఆలోచించి చేసిన సినిమా ఇది.  ‘సమ్మోహనం’ తర్వాత మంచి సినిమా చేయాలనే ఆలోచనతో ఏడాది పాటు విరామం తీసుకొని  అంగీకరించాను. వినూత్నమైన పాయింట్‌తో దర్శకుడు అద్భుతంగా సినిమాను రూపొందించారు. పోస్టర్స్‌, పాటలకు చక్కటి స్పందన లభిస్తున్నది’ అని చెప్పారు. సరికొత్త ప్రేమకథ ఇదని దర్శకుడు అన్నారు. సినిమా ప్రయాణం చక్కటి అనుభూతిని పంచిందని ప్రియాంకశర్మ చెప్పింది.  ఈ కార్యక్రమంలో శివ, శ్రీకాంత్‌రెడ్డి, పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు. 


logo