టాలీవుడ్ నటుడు సత్యదేవ్ చేస్తున్న తాజా ప్రాజెక్టు తిమ్మరుసు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. సత్యదేవ్ అడ్వకేట్ రోల్లో కనిపించనుండగా.. ట్యాక్సీవాలా ఫేం ప్రియాంక జవాల్కర్ ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను రేపు సాయంత్రం 4.50 గంటలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంఛ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని తిమ్మరుసు టీం అఫీషియల్ ట్విటర్ ద్వారా షేర్ చేశారు.
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ఎస్ ఒరిజనల్ బ్యానర్లపై మహేశ్ కోనేరు, శృజన్ యెరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యదేవ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. సత్యదేవ్ తమన్నాతో కలిసి గుర్తుందా సీతాకలం, నిత్యమీనన్ తో కలిసి సైంటిఫిక్ థ్రిల్లర్ స్కై లాబ్ చిత్రాలు చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
మరోసారి స్పెషల్ సాంగ్ లో తమన్నా..!
ఆర్ఆర్ఆర్ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
వ్యాక్సిన్ వేయించుకున్న పూజాహెగ్డే.. స్టిల్ వైరల్