బాహుబలి సినిమా తర్వాత మన దర్శకులకు మాత్రమే కాదు..నటీనటులకు కూడా మంచి డిమాండ్ వచ్చింది. అందుకే అన్ని భాషల్లోనూ మన వాళ్లు సత్తా చూపిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో కొందరు కుర్ర హీరోలు ఇతర ఇండస్ట్రీలపై కూడా దండయాత్రకు సిద్ధమవుతున్నారు. తెలుగులో వరస సినిమాలు చేస్తూనే..మరోవైపు హిందీ, తమిళంలోనూ సత్తా చూపించడానికి వెళ్తున్నారు. ప్రస్తుతం ఇదే చేయబోతున్నాడు కుర్ర హీరో సత్యదేవ్. టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్టులలో ఈయన కూడా ఉంటాడు. ఎలాంటి సపోర్ట్ లేకుండా.. చేస్తున్న సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి మరీ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు సత్యదేవ్.
ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో, అత్తారింటికి దారేది లాంటి సినిమాల్లో కనీసం గుర్తు కూడా పట్టలేనంత సేపు ఉండే పాత్రలు చేసాడు. అలాంటి సమయంలో పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన జ్యోతిలక్ష్మి సత్యదేవ్ కోరుకున్న బ్రేక్ ఇచ్చింది. అప్పట్నుంచి వరస సినిమాలు చేస్తున్నాడు సత్యదేవ్. కాస్త ఆలస్యమైన ఇప్పుడు మంచి హీరోగా నిలబడ్డాడు. తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సొంతం చేసుకున్నాడు సత్యదేవ్. ఇప్పుడు ఈయన బాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అదేంటి.. రీ ఎంట్రీ అంటున్నారు.. మొదటి సినిమా ఎప్పుడు చేసాడబ్బా అనుకుంటున్నారు కదా..?
ఇదివరకే అమితాబ్ బచ్చన్ ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమాతో పాటు అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమాలోనూ నటించాడు సత్యదేవ్. ఇప్పుడు అక్షయ్ కుమార్ రామ్ సేతు సినిమాలోనూ కీలక పాత్రలో నటించబోతున్నాడు. చాలా రోజులుగా దీనిపై వార్తలు వస్తున్నా కూడా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు సత్యదేవ్ కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ సినిమాలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు సత్యదేవ్. మొత్తానికి తెలుగుతో పాటు హిందీలోనూ తనదైన ముద్ర వేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు సత్యదేవ్. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
‘డెవిల్’గా కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ అదిరింది..వీడియో
తగ్గేదే లే అంటోన్న పూజాహెగ్డే..!
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న