గురువారం 28 మే 2020
Cinema - May 14, 2020 , 22:54:08

అధికారి కర్తవ్యం

అధికారి కర్తవ్యం

సిహెచ్‌ సత్యసుమన్‌బాబు కథానాయకుడిగా నటిస్తూ శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఐఏఎస్‌ అధికారి’.  ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.  సత్యసుమన్‌బాబు మాట్లాడుతూ ‘నిజాయితీపరుడైన ఓ ఐఏఎస్‌ అధికారి కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలని తపించిన అతడికి రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ఒత్తిడులు ఎదురయ్యాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది ఆసక్తిని పంచుతుంది. శక్తివంతమైన కథ, కథనాలతో పొలిటికల్‌ సెటైరికల్‌గా తెరకెక్కించనున్నాం. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. ప్రముఖ హీరోయిన్‌ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించనున్నది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. logo