ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 16:41:10

ప‌వ‌న్ బ‌ర్త్ డే గిఫ్ట్..‘స‌త్యాగ్రాహి’ ఫ‌స్ట్ లుక్

ప‌వ‌న్ బ‌ర్త్ డే గిఫ్ట్..‘స‌త్యాగ్రాహి’ ఫ‌స్ట్ లుక్

గతంలో స‌త్యాగ్రాహి అనే టైటిల్ తో ప‌వ‌న్ కళ్యాణ్ సినిమాను తెర‌కెక్కించాల‌నుకున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిద్దాంతాల స్ఫూర్తితో డైరెక్ట‌ర్ కృష్ణ చైత‌న్య ‘స‌త్యాగ్రాహి’  టైటిల్ తో సినిమా తీస్తున్నాడు. టాలీవుడ్ న‌టి మాధ‌వీల‌త ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ప‌వ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స‌త్యాగ్రాహి ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్ బ్యాక్ డ్రాప్ లో ప‌వ‌న్ స్టిల్ క‌నిపిస్తుండ‌గా..మాధవీ ల‌త మైక్ ప‌ట్టుకుని మాట్లాడుతుంది. శ్రీ భ‌విత క్రియేష‌న్స్ ప‌తాకంపై గంగారెడ్డి నిర్మిస్తున్నాడు. 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిద్ధాంతాలను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని..ప‌వ‌న్ ఫ్యాన్స్ అయిన న‌లుగురు యువ‌కులు స‌మాజ బాధ్య‌త‌ను తీసుకుంటే ఎలా ఉంటుంద‌నే క‌థాంశంతో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. ఈ చిత్రానికి సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తున్నాడు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo