శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 17:15:28

‘సర్కారు వారి పాట’ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ షురూ..

‘సర్కారు వారి పాట’ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ షురూ..

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్‌ దర్శకుడు. చిత్ర షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. రెండు నెలల్లో అమెరికాలో షూటింగ్‌ను మొదలు పెట్టాలని చిత్ర నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యూఎస్‌లో 45 రోజుల షెడ్యూల్‌ను చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి మరింత దిగజారకపోతే చిత్రం దసరా తర్వాత ప్రారంభం కానుంది. బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌తో సినిమాలో ఓ ముఖ్యపాత్రను చేయించనున్నట్లు కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేశ్‌బాబు సోదరిగా నటించమని ఆమెను సంప్రదించగా.. ఇంకా నిర్ణయం చెప్పనట్లు టాక్‌. ఇదిలా ఉండగా సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన పాటలు కొన్ని ఖరారు చేశారు దర్శకుడు పరశురామ్‌. ఈ సినిమాలో విలన్‌గా నటించేందుకు బాలీవుడ్‌ నటుడు అనిల్‌కపూర్‌ను సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. పరశురామ్ స్క్రిప్ట్‌ను అనిల్‌కు ఫోన్‌ చేసి చెప్పగా.. ఆ పాత్రకు ఆకర్షితుడయ్యాడని.. అయితే, ఇంకా పాత్ర చేసేది.. చేయంది ఖరారు కాలేదు. logo