గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 23, 2020 , 00:10:14

నవంబర్‌లో సెట్స్‌పైకి సర్కారు వారి పాట

నవంబర్‌లో సెట్స్‌పైకి సర్కారు వారి పాట

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్‌ దర్శకుడు. మైత్రీమూవీ మేకర్స్‌, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్‌, 14రీల్స్‌ ప్లస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్‌ కథానాయిక. దసరా అనంతరం నవంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణను అమెరికాలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కరోనా ప్రభావంతో షూటింగ్‌ ఆరంభాన్ని కొద్దిరోజులుగా వాయిదా వేశారు. బలమైన సామాజిక సందేశంతో పాటు వినోదాత్మక అంశాల మేళవింపుతో ఈ చిత్ర కథను తీర్చిదిద్దారని చెబుతున్నారు. బ్యాంక్‌ రుణాల ఎగవేతదారుల చుట్టూ అల్లుకున్న కథాంశమిదని, రైతు సమస్యల చర్చ కూడా ఉంటుందని అంటున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో మహేష్‌బాబు పాత్ర చిత్రణ నవ్యపంథాలో సాగుతుందని సమాచారం. మహేష్‌బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని చిత్రబృందం తెలిపింది. పాన్‌ ఇండియా స్థాయిలో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అనిల్‌కపూర్‌ లేదా కన్నడ నటుడు సుదీప్‌ ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మధి, సంగీతం: తమన్‌.
logo