సోమవారం 25 మే 2020
Cinema - Apr 02, 2020 , 13:07:09

బుల్లితెర‌పై స‌త్తా చాటిన‌ 'స‌రిలేరు నీకెవ్వరు'

బుల్లితెర‌పై స‌త్తా చాటిన‌ 'స‌రిలేరు నీకెవ్వరు'

అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో విజ‌యశాంతి ముఖ్య పాత్ర పోషించారు. ఈ చిత్రం దాదాపు రూ. 145 కోట్ల‌కి పైగా షేర్ రాబ‌ట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ.121 కోట్ల షేర్ వసూలు చేసిందంటే ఈ చిత్రం హ‌వా ఎలా ఉందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌హేష్ కెరియ‌ర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన ఈ చిత్రం బుల్లితెర‌పై కూడా స‌త్తా చాటింది.

ఇటీవ‌ల ప్ర‌ముఖ ఛానెల్‌లో ప్ర‌సార‌మైన స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం 23.4 టీవీఆర్ సాధించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌లో బాహుబ‌లి2 చిత్రం 22.70 సాధించ‌గా, బాహుబ‌లి తొలి పార్ట్ 21.84 రేటింగ్ రాబ‌ట్టింది. మ‌హేష్ చిత్రానికి ఈ రేంజ్ లో రేటింగ్ రావ‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే త‌మ చిత్రంపై ఇంత ఆద‌ర‌ణ చూపించినందుకు చిత్ర నిర్మాత అనీల్ సుంక‌ర ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తూ, ఈ సారి మ‌రి కొన్ని సీన్స్ యాడ్ చేసి ప్ర‌సారం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo