సినీ పరిశ్రమలో యంగ్ టాలెంటెడ్ హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో ఉంటుంది సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు సారా అలీఖాన్. ఈ బ్యూటీ చేసింది కొన్ని సినిమాలే అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం మామూలుగా లేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా మెరుస్తుంటుంది. సారా అలీఖాన్ కాస్మోటిక్ బ్రాండ్ మామా ఎర్త్ ను ప్రమోట్ చేస్తోంది. ఈ యాడ్‌కు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంటుందట.
ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఈ బ్రాండ్ ను సారా తల్లి అమృతాసింగ్ కూడా ప్రమోట్ చేయనుంది. సెలబ్రిటీ తల్లీ కూతుళ్లిద్దరూ ఇలా ఒకే బ్రాండ్ ను ప్రమోట్ చేయడం అరుదుగా కనిపించే విషయం. యాడ్ షూట్ లో సారా, అమృతాసింగ్ పాల్గొననున్నారు. ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అట్రాంగి రే చిత్రంలో నటిస్తోంది సారా అలీఖాన్. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కోలీవుడ్ హీరో ధనుష్ కీ రోల్స్ పోషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
యువ హీరోను లాక్ చేసిన మారుతి..!
డబ్బింగ్ స్టూడియో వద్ద అమీర్‌ఖాన్..ఫొటోలు వైరల్
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!