e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News జిమ్ డ్రెస్సులో సారా టెండూల్క‌ర్.. లైక్ కొట్టిన బాలీవుడ్‌

జిమ్ డ్రెస్సులో సారా టెండూల్క‌ర్.. లైక్ కొట్టిన బాలీవుడ్‌

ముంబై: మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కూతురు సారా టెండూల్క‌ర్ ఇప్పుడు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోను అప్‌లోడ్ చేసింది. జిమ్ డ్రెస్సులో ఉన్న ఫోటోను పోస్టు చేసిన సారా టెండూల్క‌ర్ తానెందుకు ఆ డ్రెస్సు వేసుకోవాల్సి వ‌చ్చిందో తెలిపింది. త‌న ఫ్రెండ్ ఓ కొత్త క్రీడా దుస్తుల షాపును ఓపెన్ చేసింద‌ని, దానిలో భాగంగానే ఆ డ్రెస్సు వేసుకున్నట్లు సారా త‌న పోస్టులో చెప్పింది. బాలీవుడ్ న‌టుడు అర్జున్ క‌పూర్‌, కార్తిక్ ఆర్య‌న్‌లు ఆ ఫోటోకు అప్పుడే లైక్‌లు కూడా కొట్టేశారు. చాలా స్ట‌యిలిష్‌గా, రిలాక్స్‌గా ఉన్న ఆ ఫోటోకు మిలియ‌న్ల సంఖ్య‌లో లైక్‌లు వ‌స్తున్నాయి. సారా టెండూల్క‌ర్ స్టయిల్ చాలా కొత్త‌గా ఉన్న‌ట్లు కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. సుమారు మూడు వేల మంది కామెంట్ కూడా చేశారు. ఫిట్‌నెస్‌ను ఇష్ట‌ప‌డే టైగ‌ర్ ష్రాఫ్ సోద‌రి కృష్ణా ష్రాఫ్ కూడా సారా పోస్టుపై కామెంట్ చేసింది.

గిల్‌తో డేటింగ్ !

- Advertisement -

23 ఏళ్ల సారా ఇప్పుడు ఫ్యాష‌న్ లోకానికి కొత్త ట్రెండ్ అయ్యారు. ఇన్‌స్టాలో అద్భుత‌మైన ఫోటోల‌ను పోస్టు చేస్తున్న ఆమె.. సోష‌ల్ మీడియా ల‌వ‌ర్స్‌ను తెగ అట్రాక్ట్ చేస్తున్న‌ది. అయితే తాజా రూమ‌ర్స్ ప్రకారం.. భార‌త క్రికెట‌ర్ శుభ‌మ‌న్ గిల్‌తో సారా డేటింగ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కోల్‌క‌తా టీమ్ త‌ర‌పున గిల్‌ ఐపీఎల్ ఆడుతున్న విష‌యం తెలిసిందే. చాలా కాలం నుంచి ఈ ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం ఉన్న‌ట్లు తెలుస్తోంది. వారి మ‌ధ్య ఉన్న బంధం గురించి వాళ్లెప్పుడూ ప‌బ్లిక్‌గా ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కానీ ఒక‌రికి ఒక‌రు మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement