బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తన తండ్రి సైఫ్ అలీ ఖాన్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలీవుడ్లో రచ్చ చేస్తుంది. కేధారనాథ్ సినిమాతో బాలీవుడ్ ఆరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్స్ అందుకుంటూ అలరిస్తుంది. సింబాలో రణ్వీర్ సింగ్ తో నటించి మంచి విజయాన్ని అందుకుంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సారా అలీ ఖాన్ సినిమా విశేషాలతో పాటు టూర్స్ కి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని థ్రిల్ చేస్తుంటుంది. ఆ మధ్య మాల్దీవ్ వెకేషన్‌కు వెళ్లిన సారా అక్కడి అందాలను ఎంజాయ్ చేస్తూ కొన్ని పిక్స్‌ను పంచుకుంది. బికినీలో సారాని చూసి థ్రిల్ అయిపోయారు.
ఇక నాక్ నాక్ అంటూ పలు వీడియోలు షేర్ చేస్తూ ఉండే సారా అలీ ఖాన్ తన ముక్కుకి అయిన గాయం చూపిస్తూ ‘నాక్.. నాక్’ అంటూ ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో సారా ముక్కుని చూసి అందరు షాక్ అవుతున్నారు. అంత పెద్ద గాయం ఎలా అయింది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అక్షయ్ కుమార్, ధనుష్ మల్టీ స్టారర్ గా రూపొందిన ‘అత్రంగీ రే’ సినిమాలో సారా అలీఖాన్ హీరోయిన్ కాగా, ‘నక్రేవాలీ’ అనే సినిమాలోను ఈ అమ్మడు నటించనుందట.