ఆదివారం 12 జూలై 2020
Cinema - Jun 03, 2020 , 09:59:56

సోద‌రుడితో సారా వ‌ర్క‌వుట్స్‌.. వీడియో వైర‌ల్

సోద‌రుడితో సారా వ‌ర్క‌వుట్స్‌.. వీడియో వైర‌ల్

సైఫ్ అలీ ఖాన్ ముద్దుల త‌న‌య సారా అలీ ఖాన్ దాదాపు ఏదో ఒక ఇష్యూతో వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంటుంది. ఇటీవ‌ల  శ‌రీరాకృతి మార్పుకి సంబంధించిన వీడియో షేర్ చేసి అంద‌రి నోరెళ్ళ‌పెట్టేలా చేసింది. తాజాగా మ‌రో వ‌ర్క‌వుట్ వీడియో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చింది.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సారా అలీఖాన్ త‌ర‌చూ త‌న సోద‌రుడితో క‌లిసి స‌ర‌దా వీడియోలు చేస్తుంటుంది. వీటిని ట్విట్ట‌ర్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అల‌రిస్తుంది. తాజాగా సోద‌రుడు ఇబ్ర‌హీం అలీఖాన్ తో క‌లిసి పుషప్స్, స్క్వాట్స్  చేసింది. ఈ వ‌ర్క‌వుట్ వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో కొద్ది క్ష‌ణాల‌లో వైర‌ల్‌గా మారింది.
logo