బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 12, 2020 , 11:45:52

రియాతో క‌లిసి డ్ర‌గ్స్ తీసుకున్న ర‌కుల్‌, సారా?

రియాతో క‌లిసి డ్ర‌గ్స్ తీసుకున్న ర‌కుల్‌, సారా?

ముంబై : న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ మాఫియా లీలలు వెలుగు చూశాయి. సుశాంత్‌తో ప్రేమాయ‌ణంలో ఉన్న రియా చ‌క్ర‌వ‌ర్తి అరెస్టుతో డ్రగ్స్ కుంభ‌కోణం బ‌య‌ట‌ప‌డింది. ఇప్ప‌టికే ఈ కేసు బాలీవుడ్‌లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారుల విచార‌ణ‌లో సుమారు 25 మంది బాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంతో సంబంధం ఉన్న‌ట్లు రియా చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఇక ర‌కుల్ ప్రీత్ సింగ్, సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ త‌న‌‌తో క‌లిసి డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు రియా వెల్ల‌డించిన‌ట్లు ప్ర‌ముఖ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. 

ర‌కుల్, సారా పేర్ల‌తో పాటు ఫ్యాష‌న్ డిజైన‌ర్ సిమోన్ ఖంభ‌ట్ట పేరు కూడా ఎన్సీబీ విచార‌ణ‌లో రియా చెప్పిన‌ట్లు వార్త‌లు షికారు చేస్తున్నాయి. మూడు రోజుల పాటు రియాను సుదీర్ఘంగా ఎన్సీబీ అధికారులు విచారించారు. ఇప్పుడు ర‌కుల్, సారాను కూడా ఎన్సీబీ విచారించే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ర‌కుల్, సిమోన్‌తో రియా ట‌చ్‌లో ఉన్న‌ట్లు కాల్ డిటైల్ రికార్డ్(సీడీఆర్) ద్వారా ఎన్సీబీ నిర్ధారించిన‌ట్లు ఆ మీడియా సంస్థ పేర్కొంది.  

ఈ కేసులో దర్యాప్తు జరిపిన ఎన్సీబీ అధికారులు నటి రియా, ఆమె సోదరుడు షోవిక్, సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరిందా, వంటమనిషి దినేష్‌ సావంత్‌ సహా  అబ్దుల్ బ‌సిత్, జాయిద్ విల‌త్రాను అరెస్ట్ చేశారు. వారందరినీ బైకుల్లా జైలుకు తరలించారు ఎన్సీబీ అధికారులు. రియా దాఖ‌లు చేసిన బెయిల్ పిటిష‌న్‌ను ముంబై సెష‌న్స్ కోర్టు శుక్ర‌వారం తిర‌స్క‌రించింది. డ్ర‌గ్స్ కేసులో రియా చ‌క్ర‌వర్తిని సెప్టెంబ‌ర్ 8న అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. 


logo