గురువారం 28 మే 2020
Cinema - Apr 27, 2020 , 11:57:52

త‌మ్ముడితో వ‌ర్క‌వుట్స్‌.. హీరోయిన్ ఫోటో వైర‌ల్

త‌మ్ముడితో వ‌ర్క‌వుట్స్‌.. హీరోయిన్ ఫోటో వైర‌ల్

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ - అమృతా సింగ్‌ల ముద్దుల త‌న‌య‌ సారా అలీఖాన్. ఇప్పుడిప్పుడే త‌న కెరియ‌ర్‌ని బిల్డ్ చేసుకుంటున్న సారా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎక్కువ‌గా త‌న త‌మ్ముడు  ఇబ్రహీం అలీఖాన్‌తో క‌లిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఆ మ‌ధ్య త‌న త‌మ్ముడితో ఉన్న ఫోటో షేర్ చేయ‌గా, ఇందులో సారా బికినీతో ఉండ‌డంతో విమ‌ర్శ‌ల పాలైంది. తాజాగా  త‌మ్ముడితో క‌లిసి దిగిన మ‌రో ఫోటో షేర్ చేసింది.

తమ్ముడితో కలిసి వర్కౌట్స్ చేస్తున్న ఫోటోని సారా షేర్ చేయ‌గా, ఇందులో  సారా పైలేట్స్ టీ షర్ట్ అండ్ షార్ట్ ధరించగా.. ఇబ్రహీమ్ మాత్రం షర్ట్ లేకుండా కేవలం షార్ట్ ధరించి వర్కౌట్ చేస్తున్నారు. స్టే హోమ్ స్టే సేఫ్.. హ్యాపీ వీకెండ్.. అంటూ కామెంట్ జతచేసింది సారా. మొత్తం మీద లాక్ డౌన్ కారణంగా జిమ్ వరౌట్స్ మిస్ అయిన సారా తన బ్రదర్ తో కలిసి ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తూ టైంపాస్ చేస్తోంది. సారా అలీఖాన్ పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.


logo