మంచి కంటెంట్‌తో రూపొందుతున్న మన తెలుగు సినిమాలు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ మేకర్స్ మన సినిమాలపై మనసు పారేసుకుంటున్నారు. ఇప్పటికే పలు తెలుగు చిత్రాలు హిందీలో రీమేక్ అవుతుండగా, ఇప్పుడు మాస్ కా దాస్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్” కూడా హిందీలో రీమేక్ అవుతుంది.
రాజ్‌కుమార్ రావు హీరోగా హిట్ చిత్రం హిందీలో రీమేక్ అవుతుండగా, ఇందులో కథానాయికగా గ్లామరస్ నటి సన్యా మల్హోత్రా ను లాక్ చేసినట్టుగా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు తెలిపారు. గతంలో ఈమె దంగల్ చిత్రంలో నటించింది. కాగా, ఇటీవల హిట్ సీక్వెల్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అడివి శేష్ హీరోగా రూపొందనున్న ఈ చిత్రాన్ని నాని నిర్మించనున్నాడు.