సంతోష్‌శోభన్, మాళవికనాయర్ జంటగా నటిస్తున్న చిత్రానికి ‘అన్నీ మంచి శకునములే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నందినీరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్వప్న సినిమాస్, మిత్రవిందా మూవీస్ పతాకంపై ప్రియాంకదత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర మోషన్‌పోస్టర్‌ను సోమవారం చిత్రబృందం విడుదలచేసింది. ‘కుటుంబ బంధాలతో తెరకెక్కుతున్న ఆహ్లాదభరిత ప్రేమకథా చిత్రమిది. అలనాటి ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ సినిమాలోని ‘అన్నీ మంచి శకునములే’ పాటను టైటిల్‌గా తీసుకున్నాం. సంతోష్‌శోభన్ పాత్ర నవ్యరీతిలో ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది’ అని చిత్రబృందం తెలిపింది. రావురమేష్, నరేష్, రాజేంద్రప్రసాద్, గౌతమి, వెన్నెలకిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, ఛాయాగ్రహణం: సన్నీ కూరపాటి, సంభాషణలు: