ఆదివారం 07 మార్చి 2021
Cinema - Jan 15, 2021 , 21:57:32

సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..

సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..

పండగొచ్చినా.. పబ్బమొచ్చినా పవన్ మాత్రం అలాగే ఉంటాడు. ఎవరితోనూ పెద్దగా కలవడు. కుటుంబంతో కూడా కలవడం కష్టమే. ఎప్పుడో ఓసారి ఆయన కుటుంబంతో పాటు పండగలు సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇప్పుడు కూడా మెగా కుటుంబం అక్కినేని వాళ్లతో కలిసి సంక్రాంతి పండగను జరుపుకున్నారు. చిరంజీవి, నాగార్జున కుటుంబాలు కలిసి పండగ చేసుకున్నారు. అందులో రామ్ చరణ్ సహా చాలా మంది ఉన్నారు. 

ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ ఇంట్లో సడన్ ఎంట్రీ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆయన్ని చూడగానే నిజంగానే అంతా షాక్ అయ్యారు కూడా. బాబాయితో చరణ్ కు మంచి అనుబంధం ఉంది. ఎప్పటికప్పుడు తమ బంధం గురించి చెప్తూనే ఉంటాడు మెగా వారసుడు. అప్పట్లో నాయక్ సమయంలో మీడియా తమ గురించి ఏం రాసినా కూడా వెంట్రుకతో సమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు చరణ్. ఆ తర్వాత తనను తాను చాలా మార్చుకున్నాడు. దాంతో పాటు పవన్ తో తనకున్న అనుబంధం గురించి కూడా ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉంటాడు చరణ్.

ఇప్పుడు కూడా ఇదే చేసాడు. కుటుంబంతో పాటు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్న తర్వాత సమయం తీసుకుని మరీ బాబాయ్ ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ పవన్‌ను కలిసి పండగ శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్, రామ్ చరణ్ కలిసున్న ఫోటోలు చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్‌తోనే వచ్చేసిందా..?

పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌భాస్ 'స‌లార్' షురూ

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!

మ‌రో క్రేజీ ప్రాజెక్టులో స‌ముద్ర‌ఖ‌ని..!

మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo