మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 12, 2020 , 18:17:55

స‌డ‌క్-2 ట్రైల‌ర్ ను ల‌క్ష‌ల్లో డిస్ లైక్ చేశారు..

స‌డ‌క్-2 ట్రైల‌ర్ ను ల‌క్ష‌ల్లో డిస్ లైక్ చేశారు..

ముంబై: బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, అలియాభ‌ట్‌, ఆదిత్యారాయ్‌కపూర్ లీడ్‌ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం సడక్‌-2. మహేశ్‌భట్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ మూవీ టీంకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ట్రైల‌ర్ కు విడుద‌లైన గంట‌ల వ్య‌వ‌ధిలోనే యూట్యూబ్ లో మిలియ‌న్ల (21 ల‌క్ష‌లు) డిస్ లైకులు వ‌చ్చాయి.ఓ సినిమాకు ఇంత పెద్ద మొత్తంలో డిస్ లైకులు రావ‌డం ఇదే మొద‌టిసారి అంటున్నారు. నెటిజ‌న్లు.సుశాంత్ సింగ్ మృతి నేప‌థ్యంలో వివాదాస్ప‌ద కామెంట్ల‌తో అలియాభ‌ట్ వార్త‌ల్లో నిల‌వ‌డం, మ‌రోవైపు మ‌హేశ్‌భ‌ట్‌పై కూడా ఆరోప‌ణం రావ‌డ‌మే దీనికి కారణమంటున్నారు.

మంచి, చెడుకు మధ్య జరిగే ఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఆగస్టు 28న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో విడుదల కానుంది. ఈ చిత్రంలో పూజాభట్‌, అలియాభట్‌ కీలక పాత్రల్లో నటించారు. గతంలోనే విడుదల కావాల్సిన ట్రైలర్‌ కొన్ని కారణాల ఆలస్యమైంది. సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రంలో కూడా సంజయ్‌దత్‌ క్యాబ్‌ డ్రైవర్‌ గా కనిపిస్తున్నాడు. సంజయ్‌దత్‌ స్టేజ్‌-3 లంగ్‌ క్యాన్సర్‌ బారిన పడ్డ విషయం తెలిసిందే.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo