శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 16, 2020 , 12:06:56

అధీరా లుక్‌లోకి మారిన సంజ‌య్ ద‌త్

అధీరా లుక్‌లోకి మారిన సంజ‌య్ ద‌త్

బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్ .. యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కేజీయఫ్ 2’ లో అధీరా అనే ప్ర‌తి నాయ‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవలే సంజయ్‌ దత్‌కి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఉందనే విషయం నిర్ధారణ కావ‌డంతో షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఒక‌వైపు  ముంబైలో చికిత్స తీసుకుంటూనే మరోవైపు షూటింగ్స్‌ని కూడా ప్లాన్‌ చేసుకునేందుకు సిద్ద‌మ‌య్యారు సంజ‌య్.

నవంబర్‌లో  సంజ‌య్ ద‌త్  ‘కేజీయఫ్‌ 2’ లొకేషన్‌లో అడుగుపెట్టనుండగా,  తన పాత్ర చిత్రీకరణ ముగిసే వరకూ ఈ షూటింగ్‌లో భాగమవుతారని సమాచారం. దాదాపు నెల రోజుల పాటు  ఆయ‌న  పాత్ర‌కి సంబంధించిన షూటింగ్ ఉండ‌నుంది. అయితే అధీరా లుక్ లోకి మారేందుకు సంజ‌య్ రీసెంట్‌గా సెలూన్‌కు వెళ్ళారు. బాలీవుడ్ ఫేమస్ హైర్ స్టయిలిష్ట్ ఆలిం హకీమ్ ఆయ‌న హెయిర్ క‌ట్‌ని అధీరా పాత్ర‌కు అనుగుణంగా మార్చారు. సంజ‌య్ ద‌త్ త‌న న్యూ లుక్ ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో అవి వైర‌ల్‌గా మారాయి. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి కేజీఎఫ్ 2 చిత్రం విడుద‌ల కానుంది.