బెంగళూర్ : కరోనా సెకండ్ వేవ్ సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు, సినీ నటులనూ బలితీసుకుంటోంది. వైరస్ తో అంతకంతకూ మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. కొవిడ్-19తో బాధపడుతూ కన్నడ సీనియర్ నటుడు శంకానంద అరవింద్(70) మరణించారు. పదిరోజుల కిందట ఆయనకు వైరస్ సోకగా బెంగళూర్ లోని విక్టోరియా మెమోరియల్ ఆస్పత్రిలో చేరారు.
కొవిడ్ చికిత్స పొందుతున్న అరవింద్ కు శుక్రవారం ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో పాటు చికిత్సకు సహకరించని పరిస్థితి నెలకొనడంతో కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచారు. కన్నడ సినిమాలో ప్లేబ్యాక్ సింగర్ గా పేరొందిన ఆయన భార్య రమ ఇటీవల మరణించారు. అనుభవ, అగంతక, అపరిచిత, శంకనంద, హువు వంటి పలు విజయవంతమైన కన్నడ చిత్రాల్లో అరవింద్ నటించారు.