సోమవారం 30 నవంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 10:10:27

కిడ్స్ బ‌ర్త్ డే వేడుక‌లో సంజ‌య ద‌త్

కిడ్స్ బ‌ర్త్ డే వేడుక‌లో సంజ‌య ద‌త్

ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో కొన్నాళ్ళుగా బాధపడుతున్న బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్ తన పిల్లలైన షహ్రాన్, ఇక్రాల పుట్టినరోజు నాడు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం రోజు షహ్రాన్, ఇక్రాల ప‌ద‌వ బ‌ర్త్‌డే కావ‌డంతో వారి బ‌ర్త్‌డేని సంజ‌య్ భార్య మాన్య‌త ద‌త్ దుబాయ్ లో ఘ‌నంగా జ‌రిపింది. 

సంజ‌య్ ద‌త్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు ఇత‌ర వ‌ర్క్స్‌తో బిజీగా ఉండ‌డం వ‌లన‌ ఆయ‌న ముంబైలోనే ఉన్నారు. దీంతో పిల్ల‌ల బ‌ర్త్‌డే వేడుక‌ల‌లో పాల్గొన‌లేక‌పోయారు. అయితే వీడియో కాల్ ద్వారా ఆ సెల‌బ్రేష‌న్స్ లో పాల్గొని సంతోషించారు. కాగా, సంజ‌య్ ప్ర‌స్తుతం కేజీఎఫ్ 2 అనే చిత్రంలో అధీరా పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.