ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Aug 09, 2020 , 08:45:51

నేను క్షేమంగానే ఉన్నాను: స‌ంజ‌య్ ద‌త్

నేను క్షేమంగానే ఉన్నాను: స‌ంజ‌య్ ద‌త్

బాలీవుడ్ స్టార్ సంజ‌య్ దత్‌కి గ‌త రాత్రి శ్వాసకి సంబంధించిన స‌మ‌స్య ఏర్ప‌డ‌డంతో వెంట‌నే ముంబైలోని ప్రైవేటు ఆసుప‌త్రిలో చేరారు. వైద్యులు కోవిడ్ పరీక్ష‌లు నిర్వ‌హించ‌గా రిపోర్ట్‌లో నెగెటివ్ అని తేలింది. అయితే సంజ‌య్‌కి  ఆక్సిజన్ లెవ‌ల్స్ హెచ్చుతగ్గులకు లోనవుతుండ‌డంతో పాటు  ఛాతీలో అసౌకర్యంగా ఉండ‌డంతో అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచారు. ప్ర‌స్తుతం అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉందని వైద్యులు పేర్కొన్నారు.

ఆసుప‌త్రిలో చేరిన త‌ర్వాత సంజ‌య్ ద‌త్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా క్షేమంగా ఉన్న‌ట్టు ప్ర‌క‌టించాడు.  ప్రస్తుతం వైద్య పరిశీలనలో ఉన్నాను . క‌రోనా రిపోర్ట్స్‌లో నెగెటివ్ అని తేలింది.  లీలావతి ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులు, సిబ్బంది సంర‌క్ష‌ణ‌తో ఒక‌టి లేదా రెండు రోజుల‌లో నా ఇంటికి వెళ‌తాను. మీ ఆశీర్వాదాల‌కి ధ‌న్య‌వా‌దాలు తెలియ‌జేస్తున్నాను అని సంజ‌య్ ట్వీట్ చేశారు. కాగా, సంజ‌య్ ద‌త్ ఆరోగ్యానికి సంబంధించి ప‌లు టెస్ట్‌లు చేయ‌గా, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ రావ‌ల‌సి ఉంద‌ని వైద్యులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సంజ‌య్ ద‌త్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కేజీఎఫ్ 2 నుండి ఆయ‌న లుక్‌కి సంబంధించి విడుద‌లైన లుక్ ప్రేక్ష‌కుల ఆనందాన్ని రెట్టింపు చేసిన విష‌యం తెలిసిందే.


 


logo