మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jul 02, 2020 , 10:40:57

బాధ‌తో ముంబైకి వీడ్కోలు చెప్పిన సుశాంత్ భామ‌

బాధ‌తో ముంబైకి వీడ్కోలు చెప్పిన సుశాంత్ భామ‌

2011లో విడుదలైన ‘రాక్‌స్టార్‌’ సినిమాతో  బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ సంజ‌న సాంఘి. రీసెంట్‌గా సుశాంత్‌తో క‌లిసి దిల్ బెచారే అనే చిత్రం చేసింది. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ఈ సినిమా ఓటీటీలో విడుద‌ల కానుంది. అయితే తాను ముంబైని వీడి స్వస్థలం ఢిల్లీకి వెళ్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. బాధాత‌ప్త హృద‌యంతో సంజ‌న ఈ పోస్ట్ చేసిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

బై బై ముంబై. నిన్ను ద‌ర్శించ‌డానికి నాలుగు నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతున్నాను. వీధులన్ని చాలా కొత్త‌గా, వింత‌గా క‌నిపిస్తున్నాయి. బ‌హుశా నా గుండెల్లోని బాధ వ‌ల‌న చూపు అలా మారిందేమో! లేదంటే నువ్వు కూడా బాధ‌లో ఉన్న‌వేమో.. త్వ‌ర‌లో మ‌ళ్ళీ క‌లవొచ్చు, లేకుంటే క‌ల‌వ‌క‌పోవ‌చ్చు అని సంజ‌న త‌న పోస్ట్‌లో పేర్కొంది. సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత సంజ‌న కూడా తీవ్ర విషాదంలో మునిగింది. సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కి సంబంధించిన విచార‌ణ‌లో సంజ‌న‌ని ముంబై పోలీసులు ఏడు గంట‌లు విచారించిన సంగ‌తి తెలిసిందే


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo