ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 10, 2020 , 17:14:17

సెలూన్‌ స్టాఫ్‌తో సంగీతా బర్త్‌ డే వేడుకలు..వీడియో

సెలూన్‌ స్టాఫ్‌తో సంగీతా బర్త్‌ డే వేడుకలు..వీడియో

కరోనానేపథ్యంలో ఇపుడు సెలబ్రిటీలంతా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ  తమ ఫంక్షన్లను ప్లాన్‌ చేసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా అలనాటి అందాల తార సంగీత బిజిలానీ తన బర్త్‌డే వేడుకలు నిరాండంబరంగా జరుపుకుంది. ముంబైలోని  ఓ సెలూన్‌ షాప్‌ బయట..స్టాఫ్‌తో కలిసి తన 60వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంది. స్టాఫ్‌ మెంబర్లతోపాటు సంగీత ఫేస్‌ మాస్కు పెట్టుకుని సామాజిక దూరాన్ని పాటించింది.

స్టాఫ్‌ అంతా పీపీఈ కిట్లతో కనిపించడం వీడియోలో చూడొచ్చు. సంగీతా కొవ్వొత్తులు ఆర్పేసి..బర్త్‌ డే కేక్‌ కట్‌ చేయగా..అంతా ఆమెకు విషెస్‌ తెలియజేశారు. ఆరు పదుల వయస్సులోనూ సరికొత్త జోష్‌తో పుట్టినరోజు జరుపుకున్న సంగీత వీడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo